కల్లెడ లోమత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామ పరిధిలో గల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నెం. M-312) పాలకవర్గ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లు సివియర్ ఎన్నికల అధికారి శ్రీ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 09 (తొమ్మిది) జనరల్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
*ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:*
*నామినేషన్ల దాఖలు:*
సెప్టెంబర్ 22, 23 మరియు 24 తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు కల్లెడ గ్రామంలోని సంఘ కార్యాలయ భవనంలో నామినేషన్లను స్వీకరిస్తారు.
*నామినేషన్ల పరిశీలన:*
సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 11:00 గంటల నుండి జరుగుతుంది. అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు.నామినేషన్ల ఉపసంహరణ: సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు.
*పోలింగ్ తేదీ మరియు సమయం:*
అక్టోబర్ 01, 2026 న ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు కల్లెడ గ్రామంలోని సంఘ కార్యాలయ భవనంలో పోలింగ్ జరుగుతుంది.
*ఓట్ల లెక్కింపు & ఫలితాల ప్రకటన:*
అక్టోబర్ 01, 2026 న మధ్యాహ్నం 01:30 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.
*ముఖ్య గమనికలు:*
•నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు నిర్ణీత రుసుముతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడెంటిటీ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు నకళ్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
•అర్హులైన ఓటర్ల జాబితాను కల్లెడ లోని సంఘ కార్యాలయం మరియు గ్రామ పంచాయితీ కార్యాలయాల నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
•సంఘ సభ్యులందరూ ఈ ఎన్నికల ప్రక్రియకు సహకరించి, శాంతియుతంగా ఎన్నికలు ముగిసేలా తోడ్పడాలని ఎన్నికల అధికారి కోరారు.
*ఎన్నికల అధికారి-మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్,కల్లెడ (గ్రా), పర్వతగిరి (మం), వరంగల్ జిల్లా.*