🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 18 Sep, 2026 | Page: 1

దివిస్ ఉద్యోగి మాటల ఎదురుదాడి! మేము ఒక్కరమే చెత్త పడవేస్తున్నామా అంటూ సహనం కోల్పోయి, హోటల్ వారిపై, నాయి బ్రాహ్మణులపై నిందలు.

దివిస్ ఉద్యోగులు సెప్టెంబర్ 16 న ఉదయం జాతీయ రహదారి ప్రక్కన చెత్త పడవేస్తుండగా మున్సిపల్ సిబ్బంది వారిని పట్టుకుని ,వినూత్నంగా వారి మెడలో దండ వేసి,500 రూపాయల జరిమానా విధించారు. ఇది ఈ ఉద్యోగులకు కొత్తేమి కాదు ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలా జరిగినా వారి తీరులో మార్పు రాలేదు. అందుకే ఇదే విషయం గురించి వారికి అవగాహన కల్పించమని కోరుతూ "ప్రియమైన ఉద్యోగులారా? అని సంబోధిస్తూ కొన్ని సలహాలు,సూచనలు చేస్తూ యాజమాన్యానికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి సామాజిక కార్యకర్త ఆకుల మధు వెళ్లగా ఒక ఉద్యోగి బాధ్యతారాహిత్యం గా మాట్లాడడమే గాక, దివిస్ ఉద్యోగులు ఒక్కరే చెత్త వేస్తున్నారా అంటూ నోరు పారేసుకోవడం, మాటలతో ఎదురుదాడి కి దిగడం జరిగింది. రిసెప్షనిస్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఏమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడానికి రెండు రోజులుగా ఫోన్లో సంప్రదిస్తున్నా కూడా అందుబాటులోకి రాక పోవడంతో నేరుగా దివిస్ కంపెనీ లోపలికి వెళ్లడం జరిగింది.

అసలు సెప్టెంబర్ 16వ తేదీ ఏం జరిగింది ?
గత కొన్ని నెలలుగా దివిస్ ఉద్యోగులు ఉదయం పూట డ్యూటీ కి వెళ్లే సమయంలో జాతీయ రహదారి పక్కన చెత్తను పడేస్తున్నారు. ఆ చెత్తను తొలగించడం కోసం మున్సిపల్ సిబ్బంది రోజంతా శ్రమించాల్సి వస్తుంది. రోజులో అత్యధిక సమయమంతా దీనికే కేటాయించాల్సి వస్తుందని వారు ఈ విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన చైర్పర్సన్ మరుసటి రోజు ఉదయాన్నే మున్సిపల్ సిబ్బందితో జాతీయ రహదారి పక్కన కాపుకాసి చెత్త పడేస్తున్న సమయంలో వారిని పట్టుకుని వినూత్నంగా వారిని పూలదండతో సన్మానించి వందల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఇలా వరుసగా రెండు రోజులు జరిగింది.. పట్టుబడిన వాళ్లందరూ దివిస్ ఉద్యోగులే... ఇదే విషయం పై మునిసిపల్ కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేశారు.
అసలు దివిస్ యాజమాన్యానికి అందజేయాలనుకున్న వినతి పత్రంలో ఏముందంటే?
మన పట్టణం - మన భాద్యత.
ప్రియమైన ఉద్యోగులారా ఆలోచించండి,అర్థం చేసుకోండి, ఆచరించండి
రోడ్లు, మరియు వీధులు, పరిసరాలు ఇవన్నీ మన పట్టణ ముఖ చిత్రాలు.
అలాంటి మన రోడ్లు, వీధులు,పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ఈ మానవ చర్యల వలన మనం రకరకాల వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. ఇదే కాకుండా భరించలేని దుర్వాసన వాయు కాలుష్యం, భూమి కాలుష్యం జరిగి మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
ఇదే కాకుండా మూగజీవులు ప్లాస్టిక్ సంచులను ఆహారంతో పాటు తినడం వలన ప్రాణాలు కోల్పోతున్నాయి.
*దయచేసి* *ఇలా* *చేయండి*
1.చెత్తను డస్ట్ బిన్ లో మాత్రమే వేయండి
2. చెత్తను పారిశుద్ధ్య వాహనాలకు అందించండి.
3. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి.
4. అవగాహనతో మెలగండి
5. చదువుకున్న వారే కాబట్టి సమాజం పట్ల బాధ్యతగా ఉండండి.
6. దయచేసి మీకేమైనా సమస్యలుంటే మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులు, మున్సిపల్ సిబ్బందితో మీ సమస్యల గురించి చర్చించండి.
7. చెత్త ను పారిశుద్ధ్య వాహనానికి ఇవ్వడంలో మీకేమైనా సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లండి.
* మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన రోడ్లను, వీధులను పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచుకుందాం.
* పరిసరాల స్వచ్ఛత మనందరి బాధ్యత.
మున్సిపల్ శాఖ వారు తక్షణమే స్పందించి ఈ విషయంపై వివరణ కోరి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
వినతి పత్రం ఇవ్వడానికి వెళితే ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం?
రోడ్ల పక్కన చెత్త వేయకండి అని అడిగితే ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారా? పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపల్ సిబ్బందితోపాటు మూగజీవాలకు, స్థానిక ప్రజలకు ఇంత ఇబ్బంది కలిగిస్తుంటే,అడిగినందుకు సమస్యను వినకుండా, మాటలతో ఎదురు దాడి చేస్తారా? సమస్యను వినకుండా చేసిన తప్పును సరిదిద్దుకోనే చర్యలు చేపట్టకుండా స్థానిక వ్యాపారస్తులపై, మరి ముఖ్యంగా హోటల్ యజమానులను, నాయి బ్రాహ్మణులను నిందించడం ఎంతవరకు సమంజసం? తప్పు జరుగుతుంది అనే విధంగా ఆలోచించకుండా సామాజిక స్పృహ లేకుండా మాట్లాడడం హేయమైన చర్య.
కావున వెంటనే దివిస్ యాజమాన్య ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, పట్టణ స్వచ్ఛత విషయం లో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ శాఖ వారిని కోరుతున్నాను.
🏠 Home