నల్లగొండ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి తీసుకోవాలి * ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెలీకంటి సత్యం
నల్లగొండ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి తీసుకోవాలి
* ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెలీకంటి సత్యం
* ఇంటి స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టులకు మద్దతు
* బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 18: నల్లగొండలో 30 ఏళ్లుగా ఇంటి స్థలం పొందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు తక్షణమే ఇంటి స్థలమిచ్చే బాధ్యతను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నల్లగొండలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం టి యూడబ్ల్యూజే (ఐజేయు ) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలను శుక్రవారం నాడు కలెక్టరేట్ ఎదుట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే తమ కుటుంబంలో బాధలు ఉన్నప్పటికిని, కుటుంబ సభ్యులకి అనారోగ్యం ఉన్నప్పటికిని బయటికి చెప్పుకోకుండా ఈరోజు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంటారని అన్నారు. అలాంటి జర్నలిస్టులకు నల్లగొండలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉందని ప్రశ్నించారు. హైదరాబాద్ వంటి నగరంలో కోట్ల రూపాయల విలువైన భూములతో పాటు, నల్లగొండలో విలువైన స్థలాలు ఇండ్లు క్రమబద్ధీకరణ పేరుతో అడ్డికి పావుశేరు అన్న విధంగా కట్టబెడుతున్న ప్రభుత్వం జర్నలిస్టులకు 200 గజాల నుంచి 300 గజాల ఇంటి స్థలాలు ఇస్తే నష్టం ఏమీ ఉంటుందని అన్నారు. 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా నల్లగొండ నియోజకవర్గం నుంచి ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో జర్నలిస్టులకు నల్లగొండలో ఇంటి స్థలం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. నల్లగొండలో జర్నలిస్టు చేసిన పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని, పోరాటం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. నల్లగొండలో జర్నలిస్టులకుఇంటి స్థలం లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, తీసుకెళ్తానన్నారు. గతంలో శాసనమండలిలో జర్నలిస్టుల సమస్యలపై ప్రస్తావించాలని, రాబోయే శాసన మండలి సమావేశాల్లో కూడా ఓసారి ప్రత్యేకంగా నల్లగొండ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు.
* జర్నలిస్టుల కోసం మంత్రి కార్యాలయం ముట్టడిస్తా : నాగం
నల్లగొండలో జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వకుండా సంవత్సరాల తరబడినిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసన గా జర్నలిస్టుల పక్షాన పోరాటం నిర్వహిస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగము వర్షిత్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టుల తొలిరోజు దీక్షలకు మద్దతు పలికిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులో తరఫున మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు పి. ప్రభాకర్ రెడ్డి, యూసుఫ్ బాబు పాల్గొని మాట్లాడారు.ఈ దీక్షలకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగిశ్రవణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి.సలీం, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్. నల్లగొండ పార్లమెంటు టిడిపి కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, 36 డివిజన్ గంట్ల అంత రెడ్డి,నాయకులు తేలు అన్న రవి, బిజెపి నాయకులు పాలకూరి రవి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి నాయకులు జక్కల పరమేష్ ఎస్ కే సలీం దోటి శ్రీనివాస్ జిల్లా యాదయ్య అశ్వక్ చిన్న పత్రికల అధ్యక్షులు మదనాచారి, ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ, కత్తుల యాదగిరి,వంగల శ్రీనివాస్ రెడ్డి చింత యాదగిరి,సయ్యద్, తెలగమల్ల దశరథ, తదితరులు దీక్షలో పాల్గొన్నారు.