🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 19 Sep, 2026 | Page: 1

బాలయ్యపల్లిలో విషాదం.. మృత విద్యార్థుల కుటుంబాలకు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి పరామర్శ, రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం

గీసుగొండ మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాగిరి గణేష్, నల్ల సిద్ధార్థ ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి గారు, జిల్లా నాయకులు, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గారు, జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి గారు ఈరోజు బాలయ్యపల్లి గ్రామానికి వెళ్లి మృత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. మృత విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకుని, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా రాగిరి గణేష్ తల్లిదండ్రులు లింగమూర్తి, అనిత, అలాగే నల్ల సిద్ధార్థ తల్లిదండ్రులు అశోక్, ఉమా దంపతులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం రాగిరి గణేష్ కుటుంబానికి రూ.10,000, నల్ల సిద్ధార్థ కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలు ఒంటరిగా లేవు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నా వంతు కృషి చేస్తాను” అని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ మాజీ సర్పంచులు కోల కుమారస్వామి, దౌడు బాబు, మాజీ ఉపసర్పంచ్ పొగాకు బిక్షపతి,గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్,వార్డు మెంబెర్ పసుల యుగేందేర్,గాడిదుల బొంద్యాలు,కందికొండ రాజు,బోయ అశోక్,చాపర్తి రాజమౌళి టైగర్, వరుణ్,డౌడు రాజేష్,బోడకుంట్ల సుదయ్య,ఇనుముల ప్రభాకర్, డౌడు కుమార్, డౌడు రవి,టి.శుభాష్, పులిచేరి మొగిలి, బాలయ్య పల్లి గ్రామానికి చెందిన రాగిరి రాజేందర్, గుండాల లక్ష్మయ్య, నేరెళ్ల చంద్రమౌళి, ఇందూరు శివరాజ్యం, నేరెళ్ల జనార్ధన్, నేరెళ్ల వీరన్న మరియు తదితరులు పాల్గొన్నారు
🏠 Home