చౌటుప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో త్రాగునీటి కష్టాలు : బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థినులు!
చౌటుప్పల్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బయటకు వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థినులు. ఇదే విషయమై జన చరిత్ర న్యూస్ విద్యార్థులను ప్రశ్నించగా! విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇదే సమస్య ఉందని వాటర్ శుద్ధి యంత్రం పనిచేయకపోవడం తో ఇలా బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం అని విద్యార్థినిలు తెలియజేసారు. సొంత డబ్బులతో కూడా నీళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు.. కావున నీటి సౌకర్యం కల్పించడం ఇంటర్మీడియట్ విద్యా శాఖ , మరియు స్థానిక మున్సిపల్ శాఖ ఉమ్మడి బాధ్యత కాబట్టి తక్షణమే దీనిపై దృష్టి సారించి సమస్యను త్వరితగతిన పరిష్కరించి మంచి నీటిని అందుబాటులో కి తెచ్చి విద్యార్థుల నీటి కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలని విద్యార్థినుల తల్లి తండ్రులు కోరుతున్నారు.