SBI RSETI మరియు SERP శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో SBI RSETI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Essential of Making Creative Jewellery” శిక్షణ కార్యక్రమం గీసుగొండ గ్రామంలోని VO బిల్డింగ్‌లో జరిగింది.
*ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి , సర్పంచ్ వీరాగోని రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు, యువతతో ఆమె మాట్లాడి, శిక్షణ ద్వారా పొందుతున్న నైపుణ్యాలు, భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.*
2026 సెప్టెంబర్ 9 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం SBI RSETI Batch No. 27/2026-27లో భాగంగా నిర్వహిస్తున్నారు. సృజనాత్మక ఆభరణాల తయారీకి సంబంధించిన నైపుణ్యాలు, తయారీ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణ అందిస్తున్నారు.
*ఈ సందర్భంగా అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహిళలు మరియు యువత శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. తమ ప్రతిభను చిన్న వ్యాపారంగా అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు, భవిష్యత్తులో మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.*
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో*
ఫార్మ్ డి.పి.ఎం వరలక్ష్మి, ఏపీఎం ఈశ్వరయ్య, ఇక్రి సాట్ శ్రీనివాస్,సి సి సురేష్,SBI RSETI ట్రైనర్ పుష్పవల్లి, వి.వో.ఏలు హేమలత, జ్యోతి, సరస్వతి భవాని, శిక్షకులు, శిక్షణార్థులు మరియు స్థానికులు పాల్గొన్నారు.