🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 19 Sep, 2026 | Page: 1

విజయవంతంగా ముగిసిన జోనల్ స్థాయి క్రీడ ఎంపికలు.

జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండలంలోని కొంకపాక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వర్ధన్నపేట జోనల్ స్థాయి క్రీడ ఎంపికలు ముగిసినట్టు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండల పీడీ లు పీఈటీ లను అభినందించారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ జి ఎఫ్ ఐ వర్ధన్నపేట జోనల్ సెక్రెటరీ పాషా గారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు మరియు 17 సంవత్సరాల విభాగంలో బాలబాలికలకు కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించబడ్డాయని ఇందులో మొత్తం 144 మంది విద్యార్థినీ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. జోనల్ స్థాయిలో ఎంపికైన 144 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించబడే క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జే రఘువీర్ , ట్రెజరర్ ఎం వెంకటేష్, ఎస్ జి ఎఫ్ ఐ వరంగల్ జిల్లా సెక్రెటరీ పి అనిల్ వర్ధన్నపేట పర్వతగిరి రాయపర్తి మండలాల పీడీలు పీ ఈ టీ లు కొంకపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ రాయబారపు రమాదేవి, ఉపసర్పంచ్ కార్మిల్ల హరిప్రసాద్, వర్డ్ మెంబర్లు ఏ ఏ పి సి చైర్మన్ స్వప్న మరియు గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home