లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో.. వడ్లకొండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూల పంపిణీ
*గ్రామ సర్పంచ్ డెక్క సునీత - కుమారస్వామి*
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి,సెప్టెంబర్ 19 ( ):
పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, ఆసరా పింఛన్ల అమలు తీరును ఎంపీడీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ పథకంలో భాగంగా విద్యార్థులకు టై, బెల్ట్, షూలను ఎంపీడీవో ,గ్రామ సర్పంచ్ డెక్క సునీత–కుమారస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ భాగంగా,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు క్రమశిక్షణ, ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పోటీ పరీక్షల ద్వారా ఎంపికై, అర్హతలు సాధించినవారన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకుని తమ పిల్లలను చేర్పించాలని సూచించారు. చదువుపై శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ , సూపర్డెంట్ ఎం. విష్ణుమూర్తి, సర్పంచ్ డెక్క సునీత - కుమారస్వామి , ఉప సర్పంచ్ బాల్లె రాజు , పంచాయతీ కార్యదర్శి వి.వాని స్కూల్ టీచర్ శిరీష, ఎం కావ్య ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్.రజిత కారోబర్ సీ ఎచ్.రమేష్
పి రమాదేవి ఎన్.అమరేందర్
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.