🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 19 Sep, 2026 | Page: 1

వరంగల్ షీ టీం ఎస్సై రామారావు ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన

తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 19
హనుమకొండ: మహిళల భద్రత,సైబర్ నేరాలపై వరంగల్ షీ టీమ్ ఎస్సై రావెళ్ల రామారావు ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు,వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు.మహిళలపై అనుచిత ప్రవర్తన ఎదురైతే ధైర్యంగా షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమణ,ఇన్‌చార్జి సంగీత,ఉపాధ్యాయులు,షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ వాట్సాప్ నంబర్ 8712685257,సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142,ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్సిఫోర్డ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రమణ మరియుస్కూల్ ఇంచార్జి సంగీత ఉపాధ్యాయులు మరియు షీ టీమ్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
🏠 Home