18వ డివిజన్ పరిధిలో యువ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని ఉత్సవాలు
వరంగల్ జిల్లా లేబర్ కాలనీ అబ్బన్ కుంట 18వ డివిజన్ పరిధిలో యువ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు సందర్భంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు వివిధ రకాల నైవేద్యాలను తీసుకువచ్చి గణనాథునికి సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
వినాయకుడి నామస్మరణతో అబ్బన్ కుంట ప్రాంతం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోయింది. చిన్నారులు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువ శక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
. ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవా భావాన్ని చాటుకున్నారు యువ శక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు.
ప్రతి ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులను ఒక్కతాటిపైకి తీసుకువస్తున్న యువ శక్తి యూత్ అసోసియేషన్ కార్యక్రమాలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తి, సంప్రదాయం, సేవా భావంతో సాగుతున్న ఈ గణనాథుని ఉత్సవాలతో అబ్బన్ కుంట ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది..
ఈ కార్యక్రమంలో గడ్డమీది రాజేష్, వినయ్, బేతి,రాజు, ముజామిల్, సాయి కృష్ణ, రాహుల్,శ్రీను, మహేష్, కర్ణాకర్, మనీ, శివ, శ్రీను, నాగ రాజు, రాకేష్, రంజిత్, ఏ శ్రీను, భాస్కర్, శ్రీకాంత్, భక్తులు స్థానికులు మహిళలు తదితరులు పాల్గొన్నారు