🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 20 Sep, 2026 | Page: 1

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు జబ్బు చేసింది! ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపణ

🔹ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిరక్ష్యం దుర్మార్గం.

🔹కేసీఆర్ గారి దూరదృష్టితో వరంగల్ సెంట్రల్ లో 24 అంతస్తులు, 2000 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తక్షణమే అందుబాటులోకి తేవాలి.

🔹నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది.

🔹ఈ రోజుపెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) అనే మహిళ పై ఏకంగా పైకప్పు ఊడి పడటం ఆందోళనకరం.

🔹ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చేరిన వాళ్ళ ప్రాణాలే గాలిలో పెట్టిన దీపాలు అవుతున్నాయ్.

🔹ప్రాణాలు రక్షించాల్సిన ఎంజీఎం ఎప్పుడూ ఏ ప్రమాదం రూపంలో ఎవరి బలికొంటుందో తెలియని దుస్థితి దాపురించింది.

🔹కేసీఆర్ గారికి ఎక్కడ పేరొస్తుందో అన్న అభద్రతాభావం తోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం లేదు.

🔹తక్షణమే రాజకీయ భేషజాలకు వెళ్లకుండా 24 అంతస్తులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించాలి.

🔹ప్రస్తుత ఎంజీఎం లో శిధిలావస్థలో ఉన్న గదులను ఖాళీ చేయించి మరమ్మతులు, ఇతర సౌకర్యాలు పెంచాలి, పారిశుధ్యం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
🏠 Home