ఏలుకుర్తి లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు. --- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నిమ్స్ లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేష్.
గీసుకొండ.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఏలుకుర్తి హవేలి గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ లైజనింగ్ అధికారి, హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ మార్త రమేష్ తన స్వగ్రామమైన ఏలుకుర్తి హవేలిలోని వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు భాగావతుల ఉమామహేశ్వర శర్మ గణపతి హోమంతో పాటు, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపించి, తీర్థప్రసాదాలు అందజేసి డాక్టర్ మార్త రమేష్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం విగ్రహా దాత రమేష్ ను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ విఘ్ననాథుని నవరాత్రి ఉత్సవాలను గ్రామంలో భక్తిశ్రద్ధలతో, ఐక్యమత్యంతో నిర్వహించడం అభినందనీయం అన్నారు.స్వామివారి కృపాకటాక్షాలతో గ్రా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
గణపతి నవరాత్రులు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపడమే కాకుండా ప్రజలందరినీ ఒక్కటి చేస్తాయి ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుండ్రు జయపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కమలాకర్, నర్సింగ రావు,రాజి రెడ్డి, కైలాసం,మోహన్,అభిషేక్,రవి,
విగ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు వంశీ, రుద్రదేవ్, తుకారాం, రాజు, భాస్కర్, సాయి ప్రణయ్, గ్రామ స్థులు,మహిళాలు,యువకులు, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని గణనాథుని సేవలో తరించారు.