🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

ఎలుకుర్తిలో ఆయుర్వేద దినోత్సవం"

ఎలుకుర్తిలో ఆయుర్వేద దినోత్సవం" గీసుగొండ మండలం
ఎలుకుర్తి హవేలి గ్రామ పంచాయతీ ఆవరణంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం నిర్వహించారు.అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైదం రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రజా పాలన, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు ,ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణ , యోగా ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన ఆరోగ్య సలహాలు వైద్య సేవలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్య భారతి ,ఉప సర్పంచ్ సురేష్ తిరుపతి రెడ్డి , భీమగాని రాoచందర్, బొమ్మినేని సంజీవ రెడ్డి, వార్డ్ మెంబెర్స్, ఫార్మసిస్ట్ ఓదెలు , నర్సింహాస్వామి, యోగ ఇన్‌స్ట్రక్టర్స్ మహేష్,మేఘన పాల్గొన్నారు.
🏠 Home