🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

పర్వతగిరి మండలంలోని దళితులు బీఆర్ఎస్ ప్రభుత్వo హయాంలోనే అభివృద్ధి సాధ్యం

జన చరిత్ర న్యూస్
పర్వతగిరిమండలం లోని దళితుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల మాజీ రైతుబందు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో మండలంలో దళితుల కోసం పలు కార్యక్రమాలు అమలు చేసినట్లు వారు తెలిపారు.
*భూ పంపిణీతో జీవనోపాధి*
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన భూ పంపిణీ పథకం ద్వారా భూమిలేని ఎస్సీ కుటుంబాలకు వ్యవసాయ భూమి అందించే కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. వడ్లకొండ గ్రామంలో 45 ఎకరములు దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమి అం దించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో భూమిలేని ఎస్సీ మహిళలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి అందించే పథకం అధికారికంగా అమలైనట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి.
*అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం*
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కల్లెడ, వడ్లకొండతో పాటు బురుగుమల్లలో అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మా ణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యం ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
*ఎస్సీ కార్పొరేషన్*
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూత ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా దళిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం ఆర్థిక సహాయ పథకాలు అమలైనట్లు జిల్లా ప్రభుత్వ రికార్డుల్లోనూ ఉంది.
*దళిత బంధు*
దళిత బంధుతో ఆర్థిక సాధికారత అనంతారం గ్రామంలో 10 మంది లబ్ది దారులకు రూ.కోటి మేర దళిత బంధు సహాయం అందించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. దళిత బంధు పథకం కింద అర్హత కలిగిన ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల గ్రాంట్ అందించే విధానం రాష్ట్రంలో అమలై నట్లు అధికారిక ప్రభుత్వ నివేదికలు పేర్కొంటున్నాయి.
*డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎస్సీలకు ప్రాధాన్యం*
చింతనెక్కొండలో 50 డబుల్ బెడ్ రూంలలో 14 ఎస్సీ లబ్దిదారులు,సో మారంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లో 9 ఎస్ సీ లబ్దిదారులు లకు నిర్మించి నట్లు బిఆర్ఎస్ నాయకులు చిన్నపాక శ్రీనివాస్ తెలిపారు. పేదలకు ఉచితంగా 2బీహెచ్కి ఇళ్లను అందించే పథకం 2015లో ప్రారంభమైందని ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయిం పుల్లో ప్రాధాన్య నిబంధనలు కూడా ఉన్నాయి.
*దళిత కాలనీల్లో సీసీ రోడ్లు*
మండలంలోని దళిత కాలనీల్లో ఎస్ఎఫ్, సీడి ఎఫ్, ఎస్ ఆర్ జి ఎస్ నిధులతో సుమారు రూ.16 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు బీఆర్ఎ స్ నాయకులు శ్రీనివాస్ వివరించారు.
*అంబేద్కర్ విగ్రహాలతో ఆత్మగౌరవానికి ప్రతీక*
పర్వతగిరి మండల కేంద్రంతో పాటు అనంతారం, చౌటపల్లి, వడ్లకొండ, అన్నారం షరీఫ్, గోపనపల్లి గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పా టుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. దళితుల ఆత్మగౌరవానికి అంబేద్కర్ విగ్రహాలు ప్రతీకగా నిలుస్తున్నాయనరూ
*పదవులు*
నామినేటెడ్ పదవుల్లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు అవకాశం మండల స్థాయిలో నామినేటెడ్ పదవు ల్లోనూ దళితులకు అవకాశం కల్పిoచామని, రైతుబంధు మండల కోఆర్డినేటర్ దళిత నాయకుడికి అవకాశం ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
*డప్పు కళాకారులు*
డప్పు కళాకారులకు ప్రోత్సాహం మండలంలోని 16 గ్రామాల్లోడప్పుకళా కారులకు 1,200కు పైగా డప్పులు, టీష రు అందించినట్లు పేర్కొన్నారు. కళాకా రుల జీవనోపాధికి, సంప్రదాయ కళల పరిరక్షణకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు.
*"ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది?"*
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల కోసం అమలు చేసిన కార్యక్రమాలను ప్రస్తావించిన నాయకులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేని ఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధించారు. ప్రజా పాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దళితులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం స్పష్టంచేయాలని చిన్నపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

“దళితుల అభివృద్ధి. ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం పర్వతగిరి మండలంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించేందుకు త్వరలో గ్రామాల వారీగా ప్రచారం ని ర్వహిస్తాం" అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నపాక శ్రీనివాస్ పేర్కొన్నారు
🏠 Home