🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

40 డివిజన్లో మంజూరైన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

40 డివిజన్లో మంజూరైన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి సోమవారం రోజున వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ వెంకన్న గారికి పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చినారు ఉప్పరోని కుంట బాక్స్ డ్రైన్ నిర్మాణం కాంట్రాక్టర్ చేస్తామని ముందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం లేదని బాక్స్ డ్రైన్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయినందున ఉర్సు హిందూ స్మశాన వాటికలోకి మురుగునీరు వస్తుందని దీనివలన దహనసంస్కారంలు చేయలేని పరిస్థితి నెల గొన్నదని ఇట్టి విషయం అధికారుల దృష్టికి పది మార్లు చెప్పిన కార్యరూపం దాల్చడం లేదని ఆరు మాసాల క్రితం బైపాస్ రోడ్డు నుండి కుమ్మరి వాడకు వెళ్ళు దారి సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ కోసం అప్పటి మంత్రి కొండ సురేఖ అప్పటి మేయర్ గుండు సుధారాణిలు శంకుస్థాపన గావించినారని కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనందున ప్రజలు నిత్యం అవస్థలు పడుతూ ప్రమాదాల పాలవుతున్నారని ఉర్సు చెరువుసమీపమున కొంతమంది బిల్డర్లు వర్షం వరద మీరు వచ్చుదారిలో విల్లాస్ ల నిర్మాణం చేపడుతున్నారని విపరీతంగా వర్షం వరదనీరు వచ్చినచో కొన్ని ప్రాంతాలు వర్ధముంపునకు గురి కావాల్సి వస్తుందని నియమా నిబంధనలకు వ్యతిరేకంగా విల్లాస్ కట్టుతున్నారని డివిజన్లో నూతనంగా వెలిసిన కాలనీలలో కరెంటు స్తంభములు లేక రాత్రివేళ బయటికి రాలేకపోతున్నారని అట్టి కాలనీలలో నూతనంగా స్తంభంలు ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లను అమర్చాలని డివిజన్లోని కొన్నిచోట్ల నూతనంగా డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కమిషనర్ వెంకన్న గారికి మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి, వినతిపత్రం ఇచ్చి వివరించగా ఆయన స్పందిస్తూ తగు చొరవ తీసుకొని అధికారులతో విచారణ జరిపించి ప్రజలు ఇబ్బంది పడకుండా అభివృద్ధి పనులు చేపట్టకు కృషి చేస్తానని ఆయన అన్నారు
🏠 Home