🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

వందేభారత్‌లో మిగిలిపోయిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ సురక్షితం రైల్వే పోలీసుల చొరవతో ప్రయాణికుడికి అప్పగింత

వరంగల్, సెప్టెంబర్ 21: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న మియాపూర్‌కు చెందిన వి.ఎస్.కె. మోహన్‌ ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో వాటర్ బాటిల్ కోసం రైలు దిగారు. అదే సమయంలో రైలు తలుపులు మూసుకుపోవడంతో తిరిగి రైలు ఎక్కలేకపోయారు. దీంతో ఆయన ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో పాటు ఇతర వస్తువులు రైలులోనే ఉండిపోయాయి.

వెంటనే మోహన్ ఖమ్మం జీఆర్‌పీ పోలీసులను సంప్రదించగా, వారు వరంగల్‌లో విధుల్లో ఉన్న ఆర్‌పీఎస్ కానిస్టేబుల్ కమలాకర్‌కు సమాచారం అందించారు. కమలాకర్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు వందేభారత్ రైలు వరంగల్ చేరుకున్న వెంటనే హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, కానిస్టేబుళ్లు రియాజ్, కమలాకర్‌లు ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

మరో రైలులో వరంగల్‌కు చేరుకున్న మోహన్‌కు బ్యాగ్‌ను సురక్షితంగా అప్పగించారు. అందులో ఉన్న ల్యాప్‌టాప్ విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని తెలిపారు. రైల్వే పోలీసుల తక్షణ స్పందన, సమన్వయంతో విలువైన వస్తువులు సురక్షితంగా ప్రయాణికుడికి చేరడంతో మోహన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home