🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు (శోభాయాత్రలో DJలకు అనుమతి లేదు): మహబూబాబాద్ టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు.*

*మహబూబాబాద్ పట్టణంలో 23-09-2026, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా నిజాం చెరువు (బతుకమ్మ కుంట) వద్ద నిమజ్జన కార్యక్రమంతో పాటు గణేష్ శోభాయాత్ర సాగే మార్గాల్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబాబాద్ టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు తెలిపారు.*

*నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందిని కీలక ప్రాంతాల్లో మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.*

*శోభాయాత్రలో DJలకు ఎలాంటి అనుమతి లేదని డీఎస్పీ గారు స్పష్టం చేశారు. DJలు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.*

*గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు మరియు ప్రజలు పోలీస్ శాఖ సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టౌన్ ఇంచార్జ్ సీఐ N. అంజలి, టౌన్ SIలు గడ్డం ఉమ, B. అంజమ్మ, U. సూరయ్య లు పాల్గొన్నారు.*
🏠 Home