వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి37వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్
శంభునిపేట : గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గిరి ప్రసాద్ నగర్ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ ఆ గణపతి దేవుని యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు ముఖ్యంగా గిరిప్రసాద్ నగర్ లోని పేదల కాలనీలో ప్రతి సంవత్సరం కాలనీవాసులు బోరిగం శ్రీనివాస్ (దుబాయ్ ) దంపతులు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని ఆ దంపతులకు వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకున్నారు. అలాగే శ్రీ సిద్ధి వినాయక యూత్ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎండి ఉల్ఫత్ మరియు కాలనీ పెద్దలు యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజలు పెద్ద పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.