🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 22 Sep, 2026 | Page: 1

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి సిగ్గుచేటు

వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారిపై పోలీసులు దాడి చేయడం అత్యంత సిగ్గుచేటని BRSV విద్యార్థి విభాగం నాయకులు కొరపల్లి రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక ఘటనను తమ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కొరపల్లి రాజేష్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులపై మరియు నాయకులపై పోలీసులు ఇలాంటి దాడులకు తెగబడటం దారుణమన్నారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
🏠 Home