హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
హసన్‌పర్తి, సెప్టెంబర్ 22:
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పెద్దచెరువు నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లు, జేసీబీ యంత్రాల పనితీరుతో పాటు రాత్రివేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ భక్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా నిమజ్జన పాయింట్ల వద్ద పటిష్టమైన నిఘా, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని ఏసీపీ ఆదేశించారు.