గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా మండి బజార్ జెండా కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ బాసిత్ తాహెర్ జెండా కమిటీ ఆధ్వర్యంలో వినాయక భక్తులకు నీరు,మిఠాయిల పంపిణీ
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 24*
గంగా జమునా తహజీబ్‌కు వరంగల్ నగరం మరోసారి చక్కటి ఉదాహరణగా నిలిచింది.మండి బజార్ అబ్దుల్ బాసిత్ తాహెర్ జెండా కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనానికి తరలివెళ్తున్న భక్తులకు నీటి సీసాలు,చిన్నారులకు మిఠాయిలు,చాక్లెట్లు పంపిణీ చేశారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మత,కుల భేదాలకు అతీతంగా మండి బజార్ జెండా కమిటీ ఇన్‌చార్జి అబ్దుల్ తాహిర్ భాయ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.వినాయక నిమజ్జనానికి వెళ్తున్న వాహనాలను ఆపి భక్తులకు నీటిని అందించడంతో పాటు చిన్నారులకు స్వయంగా చాక్లెట్లు,మిఠాయిలు పంపిణీ చేశారు.భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యం,సోదరభావం,మానవత్వాన్ని చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్గొండ రమేష్,20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుండటి నరేంద్ర,జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు,ఎం.డి.మషూక్ భాయ్,ఎం.డి.మస్తాన్,వరంగల్ చాగంటి శ్రీనివాస్,మైనారిటీ కమిటీ సభ్యులు,జెండా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.