యూపీఐ ఛార్జీల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి – AIYF జాతీయ కార్యదర్శి డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి డిమాండ్
వరంగల్, 25 సెప్టెంబర్ 2026
ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) వరంగల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో నేడు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం మరియు ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి AIYF జాతీయ కార్యదర్శి డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యూపీఐ నేడు విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు సహా కోట్లాది మంది రోజువారీగా వినియోగిస్తున్న అత్యంత ముఖ్యమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అని అన్నారు.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడం వల్ల సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, చిన్న వ్యాపారులు మరియు సామాన్య వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఛార్జీల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. డిజిటల్ చెల్లింపులు అందరికీ ఉచితంగా, సులభంగా అందుబాటులో ఉండాలని అన్నారు.ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని యూపీఐపై ఎలాంటి ఛార్జీలు విధించవద్దని తమ మద్దతును తెలిపారు.ఈ కార్యక్రమంలో AIYF వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాంబమూర్తి, యాకూబ్, రమేష్, నవీన్ మరియు AIYF జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.