చౌటుప్పల్ పట్టణ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న దివిస్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించిన కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మధు
చౌటుప్పల్ : అంకిరెడ్డి గూడెం వద్ద ఉన్న దివిస్ పరిశ్రమ కు చెందిన ఒక ఉద్యోగిపై, అలాగే పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్య, బాధ్యతారాహిత్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మధు మున్సిపల్ కమిషనర్ కి విషయాన్ని వివరించి, కార్యాలయం లో వినతి పత్రం అందించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతవారం పరిశ్రమకు చెందిన ఉద్యోగులు డ్యూటీ కి వెళ్లే సమయంలో చెత్తను రోడ్డు ప్రక్కన పడవేస్తూ మునిసిపల్ సిబ్బందికి పట్టుబడ్డారని, అలాగే మున్సిపల్ సిబ్బంది జరిమానా కూడా విధించారని , ఇలా చేయడం తగదని ఉద్యోగులలో అవగాహన కల్పించి,బాధ్యతయుతంగా ఉండమని, పట్టణ స్వచ్ఛతకు సహకరించండి అని కొన్ని సలహాలు, సూచనలతో వినతిపత్రం ఇవ్వడానికి గత వారం దివిస్ పరిశ్రమలోకి వెళితే, అసహనంతో తనపై మాటలతో విరుచుకుపడ్డాడని తెలియజేశారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి నిర్లక్ష్య వైఖరితో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ
మా ఉద్యోగులు ఒక్కరే చెత్త పడవేస్తున్నారా అంటూ మాటలతో నాపై ఎదురుదాడికి దిగడం జరిగిందని వాపోయారు.ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ, కాలుష్య కోరల్లోకి నెడుతున్న వారు అది చాలదు అన్నట్లు ఇష్టా రీతిన రోడ్డు పక్కన చెత్తను పడవేస్తున్నారని,అలా చెత్త ను పడవేయకుండా ఉండమని చెప్పేందుకు వెళ్తే ఇలా ఎదురుదాడికి దిగుతున్నారు అని వినతి పత్రంలో ఇది ఎంతవరకు సమంజసం అని వివరించడం జరిగిందని అన్నారు.
కావున తక్షణమే స్పందించి, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలియజేశారు