విద్య కోసం సొంత డబ్బుతో, "విద్యా వాలంటీర్ "ను నియమించి తొలి వేతనం అందించిన 8 వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య
చౌటుప్పల్: తన సొంత డబ్బులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్ ను నియమించి, 6000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించి ,ఔదార్యం చాటుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య. వివరాల్లోకి వెళితే లక్కారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారుగా 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే బోధన చేస్తున్నారు. అదనంగా ఇంకొక ఉపాధ్యాయులు అవసరం ఉండడంతో , విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ బద్రి గాలయ్య ముందుకొచ్చి విద్యా వాలంటీర్ ను నియమించారు. నేడు నెల పూర్తయిన సందర్భంగా నియమించిన వాలంటీర్ కు మొదటి నెల 6000 /రూపాయల గౌరవ వేతనాన్ని అందించారు. విద్యపై ప్రేమతో కౌన్సిలర్ తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తో పాటు, 8 వ వార్డు మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి,
అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుండెబోయిన కలమ్మ తదితరులు పాల్గొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుండెబోయిన కలమ్మ తదితరులు పాల్గొన్నారు.