🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 27 Sep, 2026 | Page: 1

రైలులో మిగిలిపోయిన ప్రయాణికుడి లగేజీని గుర్తించి అప్పగించిన జీఆర్పీ పోలీసులు

ఖమ్మం, సెప్టెంబర్ 26: ఢిల్లీ నుంచి ఖమ్మం వైపు జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రైల్వే స్టేషన్‌లో భోజనం కోసం దిగిన సమయంలో రైలు కదలడంతో తిరిగి ఎక్కలేకపోయారు. దీంతో ఆయనకు సంబంధించిన లగేజీ బ్యాగులు రైలులోనే ఉండిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన, ప్రస్తుతం న్యూఢిల్లీలో నివసిస్తున్న సమీర్ (36) తన లగేజీ బ్యాగుల్లో దుస్తులు, పర్సు, గుర్తింపు కార్డు, రూ.2,520 నగదు, ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొంటూ రైల్వే హెల్ప్‌లైన్ 139కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే జీఆర్పీ సీఐ వి. నరేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్లాట్‌ఫాం విధుల్లో ఉన్న సిబ్బంది అనిల్, ఫయాజుద్దీన్‌లు జీటీ ఎక్స్‌ప్రెస్‌ను అటెండ్ చేసి లగేజీ బ్యాగులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీర్‌ను జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, ఆయనకు సంబంధించిన లగేజీ బ్యాగులను సురక్షితంగా అప్పగించారు.

లగేజీని సకాలంలో గుర్తించి బాధితుడికి అప్పగించిన జీఆర్పీ సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.
🏠 Home