మై యూత్ – మైహెల్త్– మై ప్రైడ్” కార్యక్రమం ద్వారా యువతకు ఆరోగ్య అవగాహన
నషా ముక్త్ భారత్ అభియాన్ – 100 ఆదివారాల శిబిరం లలో భాగంగా “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్” కార్యక్రమాన్ని వరంగల్‌లోని యం జి యం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా “మై యూత్ – మైహెల్త్– మై ప్రైడ్” పేరిట యువతకు ఆరోగ్య అవగాహన కార్యక్రమంతో పాటు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారు మాట్లాడుతూ, దేశ జనాభాలో యువత శాతం గణనీయంగా ఉందని, యువత మంచి అలవాట్లను అలవరచుకొని విద్య, జ్ఞానం, శారీరక మరియు ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు తదితర వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.
చిన్న వయస్సులోనే ఏర్పడే అనారోగ్యకరమైన అలవాట్లు క్రమంగా బలపడే అవకాశం ఉన్నందున, యువత ప్రారంభ దశలోనే వాటిని నియంత్రించుకోవాలని సూచించారు. మెరుగైన ఆలోచనలు – మెరుగైన భవిష్యత్తు దిశగా యువత ముందుకు సాగాలని, దేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
యువత యోగ, ధ్యానం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే కంటే, ముందుగానే అప్రమత్తమై వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో “మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం, తోటి వారిని కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తాం, వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత సంకల్పాన్ని నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేస్తాం” అనే ప్రతిజ్ఞ చేయించారు.
*హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్*
కార్యక్రమంలో భాగంగా యువతకు బి ఎం ఐ, బి పి, సాధారణ ఆరోగ్య పరీక్షలు, వైద్యుల ద్వారా ఆరోగ్య సలహాలు మరియు అవసరమైన కౌన్సెలింగ్ అందించారు. వివిధ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలకు రిఫర్ చేసే విధంగా స్క్రీనింగ్ 120 మంది యువతకు నిర్వహించారు.
**100 ఆదివారాల శిబిరం – నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్”**లో భాగంగా యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్ప్రభావాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యసన విముక్తి మరియు బాధ్యతాయుతమైన పౌరస్పూర్తిని పెంపొందించే దిశగా కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి, యం జి యం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రామ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ డి ఎమ్ ఎచ్ ఓ/డి ఇ ఓ డా. ఐ. ప్రకాష్, ప్రోగ్రాం అధికారి (ఎన్ టి ఇ పి) డా. అరుణ్ జోషి, జిల్లా యువజన అధికారి బి. సంజీవ్, ఎన్ ఐ టి ప్రొఫెసర్ యు. వెంకన్న, వైద్య అధికారులు డా. ఎం. శ్రవణ్ కుమార్, డా. వేద కిరణ్, ఫిజిషియన్ డా. విశ్వభారత్ రెడ్డి, సైక్రీయాటిస్ట్ డా. భరత్, డి పి ఎం (ఎచ్ ఐ వి/ ఎయిడ్స్) స్వప్న మాధురి, నర్సింగ్ ట్యూటర్ శ్రీమతి రాణి, డిప్యూటీ డెమో ఎస్. వెంకటేశ్వర్లు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.