ఉద్యోగానికి వీడ్కోలు..ప్రజాసేవకు శ్రీకారం
*ఉద్యోగం నుంచి మాత్రమే విరమణ..ప్రజాసేవ నుంచి కాదు మహమ్మద్ సర్వర్ అహ్మద్*
*ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం..భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు,అభిమానులు*
*తెలంగాణ వరంగల్/ములుగు,సెప్టెంబర్ 28*
ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహమ్మద్ సర్వర్ అహ్మద్ ఉద్యోగ జీవితానికి సోమవారం వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్ పాల్గొని శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు తన మాటలతో అందరినీ ఆకర్షించారు.అయితే ప్రజాసేవకు మాత్రం కొత్తగా శ్రీకారం చుట్టారు.వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట పరిధిలోని నర్సింగాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆయన పదవీ విరమణ కార్యక్రమం ఆత్మీయత,అభిమానం,సేవా స్ఫూర్తితో ఘనంగా జరిగింది.సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు,సామాజిక కార్యకర్తలు,పాత్రికేయులు,ఆత్మీయులు హాజరై సర్వర్ అహ్మద్‌ను ఘనంగా సన్మానించారు.విద్యాసేవ నుంచి సామాజిక సేవ వరకు..తెలంగాణ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా,నర్సింగాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించిన సర్వర్ అహ్మద్ విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారు.ఉపాధ్యాయ వృత్తితో పాటు సామాజిక సేవ,పాత్రికేయ రంగం, కలాం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అండగా నిలిచారు.ఆయన అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు,వక్తలు ప్రత్యేకంగా కొనియాడారు.ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ స్థాయి పురస్కారంతో సత్కరించిన విషయాన్ని పలువురు గుర్తుచేశారు.ఉద్యోగం ముగిసింది..సేవ కొనసాగుతుంది పదవీ విరమణ సందర్భంగా మహమ్మద్ సర్వర్ అహ్మద్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితం ముగిసినప్పటికీ ప్రజలతో తన అనుబంధం,సేవా కార్యక్రమాలకు ఎలాంటి విరామం ఉండదన్నారు.ఒక విద్యార్థికి మంచి భవిష్యత్తును అందించడం ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టవచ్చని,ప్రజలకు అండగా నిలవడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.తన మిగిలిన జీవితాన్ని ప్రజాసేవకు మరింతగా అంకితం చేస్తానని తెలిపారు.మోటివేషనల్ స్పీకర్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కార్యక్రమానికి హాజరై సర్వర్ అహ్మద్ సేవలను ప్రశంసిస్తూ ప్రసంగించారు.వైద్యవృత్తి,ఉపాధ్యాయ వృత్తి,సామాజిక సేవ,పాత్రికేయ రంగం,కలాం ఫౌండేషన్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలను ప్రస్తావిస్తూ అభినందించారు.సేవాభావంతో పనిచేసే వ్యక్తులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు.అన్నదానంతో సేవా సందేశం పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన అతిథులు,అభిమానులు,ప్రజల కోసం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నర్సింగాపురం పాఠశాల ఆవరణ సందడిగా మారింది.తోటి ఉపాధ్యాయులు,ఆత్మీయులు,అభిమానులు సర్వర్ అహ్మద్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఉద్యోగానికి వీడ్కోలు పలికినప్పటికీ ప్రజాసేవకు మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పలువురు పేర్కొన్నారు.సర్వర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆయన విద్యాసేవ,సామాజిక సేవా ప్రస్థానానికి ప్రతీకగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,అభిమానులు,కుటుంబ సభ్యులు,స్నేహితులు శిశువులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...