మహిళలపై అవగాహన కార్యక్రమం.. సంప్రదాయాలు, సంస్కృతిపై చైతన్యం.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ అనాలసిస్ రుద్రోజు పరమేశ్వరి పేర్కొన్నారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, వ్యక్తిగత భద్రతతో పాటు భారతీయ సంప్రదాయాలు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుత కాలంలో ఆధునికతను స్వీకరించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధంగా దుస్తులు, నడవడి ఉండాలని సూచించారు. అయితే దుస్తుల విషయంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ.. సందర్భానికి, వయసుకు, ప్రదేశానికి అనుగుణంగా దుస్తులు ధరించేలా అవగాహన కల్పించడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ్యతగా పేర్కొన్నారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించే విధానం నేర్పించాలని సూచించారు. పిల్లలు ధరించే దుస్తుల విషయంలో వారి వయసు, సౌకర్యం, సందర్భాన్ని తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.
పిల్లలపై ఆంక్షలు విధించడం కంటే.. వారికి విషయాలను అర్థమయ్యేలా వివరించి, మంచి చెడుల మధ్య తేడాను తెలియజేస్తూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిగత భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ, అనుమానాస్పద పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాలని సూచించారు.
మహిళలను గౌరవించడం, బాలికలకు రక్షణ కల్పించడం కేవలం మహిళల బాధ్యత కాదని.. కుటుంబం, సమాజం మొత్తం కలిసి బాధ్యతగా తీసుకోవాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఆధునికతతో పాటు సంప్రదాయ విలువలను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనాలసిస్ రుద్రోజు పరమేశ్వరి సూచించారు.