🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 29 Sep, 2026 | Page: 1

పాఠశాలలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు

*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28
లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ వరంగల్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వర్ధన్నపేట ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ జనార్ధన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ కృష్ణ విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. వారానికి కనీసం రెండు గంటలు, సంవత్సరానికి 100 గంటలను పరిశుభ్రత కోసం కేటాయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ ఎఫ్‌ఎల్‌సీ భాస్కరాచారి, సిఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, యాకూబ్ పాషా, మణికాంత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, నాజియా సల్మా, ఉపాధ్యాయులు శ్రీరామ్, చందు, ఉపాధ్యాయినులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home