🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 29 Sep, 2026 | Page: 1

శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం చైర్మన్ల సన్మానం

జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా *పర్వతగిరి సహకార సంఘం చైర్మన్‌గా పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి సహకార సంఘం చైర్మన్‌గా అత్తి కుమారస్వామి* నియమితులైన సందర్భంగా పర్వతగిరి పట్టణ *శ్రీకృష్ణ యాదవ సంఘం* సభ్యులు వారిని శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా *పిన్నింటి అనిల్ రావు* మాట్లాడుతూ, యాదవ సోదరులకు సహకార సంఘం ద్వారా సహాయం, సహకారం అందించడంతో పాటు పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే గొర్రెలు, మేకలు, పశువుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

యాదవ సంఘం అభివృద్ధి, సమస్యలను *వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో *పర్వతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి* తో పాటు *శ్రీకృష్ణ యాదవ సంఘం* సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home