🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 03 Oct, 2026 | Page: 1

కేయూసీ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత

హనమకొండ, అక్టోబర్‌ 2: హనమకొండలోని గౌతమ్‌నగర్‌, యాదవనగర్‌ సమీపంలో అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేయూసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ కిరాణా దుకాణంలో తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో అక్రమంగా విక్రయించేందుకు నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.3,030గా పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి గౌతమ్‌నగర్‌కు చెందిన **చల్ల శ్రీనివాస్‌ (45)**ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు.

ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ. మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ కె. శ్రీధర్‌, ఎస్‌ఐ టి. వీరస్వామి, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home