🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 29 Oct, 2026 | Page: 1

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదాన శిబిరం జనగామలో 140 యూనిట్ల రక్తం సేకరణ.. రక్తదాతలను అభినందించిన పోలీసు అధికారులు



జనగామ, అక్టోబర్ 28: పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని జనగామ పట్టణంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఐపీఎస్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

జనగామ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో స్థానిక యువత, సర్పంచులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 140 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన యువత, సర్పంచులను పోలీసు అధికారులు అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు సూచించారు.

పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది.
🏠 Home