🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 29 Oct, 2026 | Page: 1

ఉర్సు గుట్ట కూడా మైదానంలో నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ

ఉర్సు గుట్ట కూడా మైదానంలో నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వధ ఉత్సవంలు జరుగు స్థలంలో ఉత్సవ కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన కరెంటును నిరంతరం సరఫరా చేయిస్తానని డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శంకేసి మల్లికార్జున్ అన్నారు బుధవారం రోజున కరీమాబాద్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కార్యాలయంలో నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి డి ఈ శంకేసి మల్లికార్జున్ కు వినతిపత్రం ఆహ్వాన పత్రం అందజేశారు 6 వ తారీఖున సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు 9 గంటలకు నరకాసురవద కార్యక్రమం జరుగుతాయని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండ సురేఖ మురళీధర్ రావులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని ఉత్సవ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా నాణ్యమైన కరెంటును నిరంతరం సరఫరా చేయాలని డిఈ గారికి మరుపల్ల రవి కోరినారు ఎలక్ట్రికల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ చంద్రమౌళి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంపత్ లకు వినతి పత్రం ఆహ్వాన పత్రికను అందజేశారు ఇట్టి కార్యక్రమంలో నరకాసుర వద ఉత్సవ కమిటీ ప్రతినిధులు మరుపల్ల గౌతం దూడె బాల కొంరెల్లి వనం కుమార్ కాటం సతీష్ కుండే రాజు బలభద్ర శివకృష్ణ లు ఉన్నారు
🏠 Home