మతసామరస్యం కోసం విస్తృతంగా కృషి చేసిన మోటూరి కృష్ణ ప్రసాద్ మనకు ఆదర్శం - జస్టిస్ చంద్ర కుమార్

*రాజ్యాంగ పరిరక్షణే మనం కేపీకి ఇచ్చే నివాళి - ఈటీ నరసింహ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి*
*హైదరాబాద్,
వామపక్ష శ్రేయోభిలాషి, భారత్ నేషనల్ మూవ్ మెంట్ జాతీయ కన్వీనర్ మోటూరి కృష్ణ ప్రసాద్ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఇండియన్ నేషనలిస్ట్ మూవ్ మెంట్ (INAM) ఆధ్వర్యంలో స్మారక సభ జాతీయ సెక్రటరీ జనరల్ మహమ్మద్ జుబేర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మేధావులు, వామపక్ష పార్టీల నాయకులు మోటూరి కృష్ణ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సభను ఉద్దేశించి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ మోటూరి కృష్ణ ప్రసాద్ ఓల్డ్ సిటీలో జన్మించి విద్యార్థి దశ నుండే ఉద్యమాల వైపు ఆకర్షితులై అనేక పోరాటాల్లో పాల్గొన్నారని అన్నారు. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగులో అనర్గళంగా ప్రసంగిస్తూ ఎంతో మంది యువతను ఆకర్షించారని, మత ఘర్షణలకు వ్యతిరేకంగా ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సంస్థను ఏర్పాటు చేసి అనేక సదస్సులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర డెమోక్రటిక్ ఫోరం ఏర్పాటులో కృష్ణ ప్రసాద్ క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఈటీ నరసింహ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తోందని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటాలు నిర్వహిస్తున్న ఉద్యమ నాయకుల గొంతు నొక్కుతూ నిర్బంధాలు విధిస్తోందని, ప్రజలకు జీవించే హక్కుతో సమానమైన ఓటు హక్కును SIR అనే ప్రక్రియ ద్వారా తొలగించేందుకు అనేక కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజా ఉద్యమాలే పునాది అని, ఢిల్లీ నగరంలో Gen Z చేసిన పోరాటాన్ని చూసి కామ్రేడ్ మోటూరి కృష్ణ ప్రసాద్ బ్రతికి ఉంటే గర్వించేవారని తెలిపారు.
కరోనా సమయంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా మందులు తయారు చేసి ప్రజల జీవితాలను కాపాడడంలో ఒక శాస్త్రవేత్తగా కేపీ తన బాధ్యతను నిర్వహించారని గుర్తు చేశారు. అనేక ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు విస్తృత సేవలు అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో AIKMS జాతీయ కార్యదర్శి J.V చలపతి, IFTU జాతీయ కార్యదర్శి ప్రదీప్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే గోవర్ధన్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రేమ్ పావని, INAM జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ మాజీద్, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్లా, మసియొద్దీన్ అఫ్సర్, ఖైరుద్దీన్ సూఫీ తదితరులు ప్రసంగించారు.