🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 01 Nov, 2026 | Page: 1

‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి హనుమకొండ కాంగ్రెస్ నాయకులు

‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి హనుమకొండ కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ జెండా ఊపి ప్రత్యేక బస్సులను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

హనుమకొండ: ఢిల్లీలో నవంబర్ 1న జరగనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బయలుదేరిన నాయకుల బస్సులను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో నాయకులు ఢిల్లీకి చేరుకోనున్నారు.

ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, కే.ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ, పరకాల, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి తరలివెళ్లారు.

ఢిల్లీలో జరిగే ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
🏠 Home