ప్రజావాణికి అధికారులు గైర్హాజరు.. చర్యలు తీసుకోవడంలో ఎంపీడీవో నిర్లక్ష్యం!

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 22 శాఖల అధికారులు హాజరు కావాల్సిందే – మారపల్లి మల్లేష్ డిమాండ్
టేకుమట్ల: మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 22 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం ఐదు, ఆరు శాఖల అధికారులు మాత్రమే హాజరవుతున్నారని సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఆరోపించారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అయితే టేకుమట్ల మండలంలో ప్రజావాణికి సంబంధిత శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనేక సమస్యలతో ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 22 శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా మండల అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు గైర్హాజరవుతున్నప్పటికీ ఎంపీడీవో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కోరారు.