వరంగల్‌లో జోరుగా పేకాట.. ఎనిమిది మంది అరెస్ట్

భిల్వా ఇన్ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. రూ.55,280 నగదు, 8 సెల్‌ఫోన్లు, 5 వాహనాలు స్వాధీనం
వరంగల్, నవంబర్ 1: వరంగల్ నగరంలోని ఎస్‌వీపీ రోడ్డులో ఉన్న భిల్వా ఇన్ హోటల్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది.
ఈ దాడిలో నిందితుల నుంచి రూ.55,280 నగదు, పేకాట ఆడేందుకు ఉపయోగించిన ఆటపత్తాలు, 8 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో వరంగల్‌లోని గిర్మాజిపేటకు చెందిన గాడె రాజేందర్, కాశిబుగ్గకు చెందిన దుబాసి అనిల్, శివనగోస్ ప్రాంతానికి చెందిన బిల్లా శివకుమార్, హనుమకొండ అలంకార్ ప్రాంతానికి చెందిన బల్లి శేఖర్, ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన కొకొండ వేణు, కరీమాబాద్‌కు చెందిన పింగళికర్ మహేష్, ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన గడ్డం రాజు, కాశిబుగ్గకు చెందిన నార్షెట్టి చిరంజీవి ఉన్నారు.
పట్టుబడిన ఎనిమిది మందిని, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. క్రాంతి కుమార్, ఎస్సైలు కె. సుధాకర్, బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.