ప్రజల ముంగిటకు పోలీస్ సేవలు.. ఇంటింటికీ వెళ్లి అవగాహన
ప్రజల ముంగిటకు పోలీస్ సేవలు.. ఇంటింటికీ వెళ్లి నేరాల నివారణపై అవగాహన
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్
హనుమకొండ: ప్రజల్లో నేరాల పట్ల అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు హనుమకొండ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పోలీస్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కలిసి రెడ్డి కాలనీలోని పలు ఇళ్లను సందర్శించి మహిళలకు, స్థానిక నివాసితులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, ఆస్తి సంబంధిత నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆన్లైన్ ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పిల్లల స్నేహితులు, అలవాట్లు, రోజువారీ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారితో స్నేహపూర్వకంగా మెలిగి మంచి చెడులపై అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ప్రజల భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించినప్పుడే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లూ కోల్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.