సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాల్య వివాహాలను అరికట్టాలి

పిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: తాడ్వాయి ఎస్ఐ
ములుగు జిల్లా, నవంబర్ 2:
ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశెట్టివాయి గ్రామంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై తాడ్వాయి ఎస్ఐ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై మాట్లాడుతూ, బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని తెలిపారు. బాల్య వివాహాల వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించినా, నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే పోక్సో చట్టం గురించి వివరిస్తూ, 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపులు, దాడులు, ఇతర నేరాల నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులో ఉందని తెలిపారు. పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల హక్కుల పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా, పిల్లలపై వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, బాలల రక్షణకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. బాల్య వివాహాలను అరికట్టండి.. బాలల హక్కులను కాపాడండి.