🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 04 Nov, 2026 | Page: 1

తిప్పర్తిలో సబ్‌జూనియర్ బాలుర కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు



తిప్పర్తి: నల్గొండ జిల్లా సబ్‌జూనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు ఈరోజు పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ తిప్పర్తి పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా నల్గొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు భూలోకరావు, కార్యదర్శి కర్తయ్య మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల విద్యాధికారి నర్సింహా నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి, డొమినిక్, లీల హాస్పిటల్ చైర్మన్ (మిర్యాలగూడ) చైతన్య రాజ్, షాహిద్, అన్వార్ కొండల్, మురళి, తస్లీమ్,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్. లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
🏠 Home