*ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి*
వరంగల్ పోలీస్ కమిషనరేట్
తేదీ: 04-11-2026
*ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి*
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు కేసుల దర్యాప్తు, కోర్టు విధానాలపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్ 22న ప్రారంభమైన 12 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు నవంబర్ 4న ముగిశాయి.
ఈ శిక్షణలో భాగంగా కేసుల దర్యాప్తు విధానం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్షుల విచారణ, వివిధ శాఖల నుంచి అవసరమైన ఆధారాల సేకరణ, చార్జిషీట్ల తయారీ, కోర్టులో సాక్షుల హాజరు, పటిష్టమైన ఆధారాలతో నేరస్థులకు శిక్షలు పడేలా కేసులను నిరూపించడం వంటి కీలక అంశాలపై శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ, నాణ్యమైన దర్యాప్తు, పకడ్బందీగా ఆధారాల సేకరణ, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ద్వారా కేసులను పకడ్బందీగా నిరూపించేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారుల పనితీరు, దర్యాప్తులో చూపే ప్రతిభ, కేసుల పరిష్కారంలో సాధించే ఫలితాలను బట్టి ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు, రివార్డులు అందజేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. దర్యాప్తులో ప్రతి అంశానికి ప్రాధాన్యతనిస్తూ, చట్టపరమైన విధానాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, సిసిఆర్బి ఏసీపీ డేవిడ్ రాజ్, సీసీఎస్ ఏసీపీ సదయ్య, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సిసి ఆర్బి ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తో పాటు ఇతర పోలీస్ అధికారులు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.