🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 05 Nov, 2026 | Page: 1

ఘనంగా ముగిసిన 5వ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు – 1,535 మంది పోలీస్ క్రీడాకారుల పాల్గొనడం

ప్రెస్ నోట్
తేదీ: 05-11-2026
వరంగల్ పోలీస్ కమిషనరేట్
*ఘనంగా ముగిసిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026*
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026 ఘనంగా ముగిసింది.
హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం, స్కిల్ స్టోర్క్ స్కూల్, కిట్స్ కళాశాల క్రీడా ప్రాంగణం మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాలులో పురుష, మహిళా పోలీస్ క్రీడాకారులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు.
ఈ పోలీస్ మీట్‌లో భాగంగా వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖో-ఖో, కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, సెపక్ తక్రా తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన 1,535 మంది పోలీస్ క్రీడాకారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్టీ జోన్-1 ఐజీ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, ఇలాంటి క్రీడా పోటీలు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యం, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులకు వార్షిక ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, జట్లకు బహుమతులు, ట్రోఫీలను అందజేసి అభినందించారు. మూడు రోజుల పాటు క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ గారిని మరియు ఇతర అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారులు చక్కటి క్రమశిక్షణతో క్రీడా పోటీల్లో పాల్గొని తమ క్రీడాస్ఫూర్తిని చాటారని తెలిపారు. ఇంతటి ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజాసేవలోనూ అదే ఉత్సాహంతో ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా, మూడు రోజుల పాటు క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాయల ప్రభాకర్ రావు, ఇతర అడిషనల్ డీసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home