🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 06 Nov, 2026 | Page: 1

తొలగించిన వివోఏ ని విధులలోకి తీసుకోవాలి* సిఐటియు



తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలోని వివోఏ గా పనిచేస్తున్న అన్నపూర్ణను అకారణంగా వివోఏగా తొలగించారని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రాల మంగమ్మ మండల అధ్యక్షురాలు ఎండి రుమాన అధికారులను డిమాండ్ చేశారు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని సమైక్య ఆఫీస్ ముందు తిప్పర్తి మండల వివోఏ లు అందరూ సమ్మెకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ఆరోపణలు లేకుండా రాజకీయ ఒత్తిడితో అన్నపూర్ణను వీధిలో నుంచి తొలగించారని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల మండలంలోని వివోఏలందరూ సమ్మెలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనం లేకున్నా అనేక సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుందని చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కొందరు కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఇటువంటి చర్యలు మానుకోవాలని వారు అన్నారు వెంటనే అన్నపూర్ణ ను విధుల్లోకి తీసుకునేంతవరకు సమ్మె కొనసాగుతుందని ఈ ఉద్యమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు *ఈ కార్యక్రమంలో మండల వివోఏలు జి సునీత, సువర్ణ, సామ్రాజ్యం, రాణి, సంధ్య, వసుమతి, జయమ్మ, లక్ష్మి, మౌనిక, హేమలత, మల్లయ్య, నాగరాజు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు*
🏠 Home