*ప్రభుత్వ నిబంధనలు ఎవరికి పట్టవా? బాణాసంచా దుకాణాలతో ప్రజల్లో కలకలం*
*అధికారులకు చేతివాటాలే కారణమా అనే అనుమానాలు*
*షాపుకు షాపుకు మధ్య 9 ఫీట్ల డిస్టెన్స్ నిబంధనకు ఆర్డీవో త్రిలోధకాలు*
*గుట్టుచప్పుడు కాకుండా ఆర్డీవో అనుమతులు*
*బాణాసంచా నిల్వలు అమ్మకదారుల ఇండ్లలోనే డంపింగులు*
*ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు రక్షణెవరు*?
*బాణాసంచా అమ్మకదారుల ఇళ్లల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించాలని స్థానికుల విన్నపం*
జన చరిత్ర (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
తొర్రూర్, నవంబర్ 07
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి బాణాసంచా అమ్మకాలకు అనుమతులు ఇచ్చిన తొర్రూర్ ఆర్డీవో తీరు చూస్తుంటే కంచె చేను మేస్తే కాపు ఎవరు అన్న చందంగా ఉండడం ప్రజల్ని ఆందోళన గురిచేస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాణాసంచా షాపుకు షాపుకు మధ్య 9 ఫీట్ల దూరాన్ని పాటించాల్సి నిబంధన ఉన్నా కూడా, పట్టించుకోకుండా, బాణాసంచా నిలువలను గోదం లో నిలువ చేయాల్సింది పోయి, అమ్మకదారుల యొక్క ఇండ్లలోని ఈ నిల్వలను ఉంచడం మూలంగా ఆ ఇంటి పక్కన ఉన్న ఇండ్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి బాణాసంచా నిలువలు విస్ఫోటనం చెందితే, మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని బాణాసంచా అమ్మకదారుల చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వా నిబంధనలను తుంగలో తొక్కి తొర్రూర్ ఆర్డీవో, గుట్టు చప్పుడు కాకుండా, బాణాసంచా అమ్మకదారులకు అనుమతులు ఇవ్వడం స్థానిక పట్టణ కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. దీని మూలంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ నిబంధనలకు నీళ్లు పోస్తూ, చేతివాటాలకే అధికారి పరిమితమైపోయాడ అని ఒక వైపు, వదంతులు వినిపిస్తున్నాయి. కానీ స్థానికులు మాత్రం ఇది నిజమే అంటున్నారు. కావున టాస్క్ ఫోర్స్ అధికారులు తక్షణమే స్పందించి బాణాసంచా అమ్మకదారుల ఇళ్లల్లో సోదాలు జరిపి జననివాసాలలో నిలువ ఉంచిన బాణా సంచా నిలువలను సీజ్ చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.