భూపాలపల్లి నుంచి టేకుమట్లకు బస్సు సౌకర్యం కల్పించాలి

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్
టేకుమట్ల: భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి టేకుమట్ల మండల కేంద్రానికి నిత్యం బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి టేకుమట్ల మండలానికి వెళ్లే ప్రజలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, మహిళలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర అవసరాల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి భూపాలపల్లి నుంచి టేకుమట్ల మండల కేంద్రానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజా అవసరాలను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని టేకుమట్ల మండల ప్రజలకు నిత్యం బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.