🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 07 Nov, 2026 | Page: 1

*తొర్రూర్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం*

*తొర్రూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు – రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..*

*తొర్రూరు పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తోందని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు..*


జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
తొర్రూర్, నవంబర్ 07


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.80 లక్షల సాధారణ నిధుల (MGF)తో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు మరియు కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, వార్డు కౌన్సిలర్లు బాపు రెడ్డి, పెద్దగాని కళావతి సోమన్న, భద్రు నాయక్, బసనబోయిన ఐలమ్మ, పట్టణ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్, మండల అధ్యక్షులు రవీంద్ర చారి, కంటెస్టెడ్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home