🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 13 Nov, 2026 | Page: 1

హనుమకొండ: సమాజంలో వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు,సూక్ష్మ

*వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతుగా సేవా క్రెడిట్ సొసైటీ 15 రోజుల ప్రచారం*

*వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహమే లక్ష్యం..విజన్‌ 2030తో మరో 100 శాఖల విస్తరణకు ప్రణాళిక*

*తెలంగాణ/వరంగల్,నవంబర్ 13*

హనుమకొండ: సమాజంలో వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు,సూక్ష్మ రుణాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో సుబేదారిలోని సేవా క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో 15 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.‘నేను వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతు ఇస్తున్నాను’అనే నినాదంతో గోకుల్‌నగర్‌లోని మిన్హాజ్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రారంభ సమావేశానికి సేవా వరంగల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు ఖాలిద్ సయీద్,ఆపరేషన్స్ డైరెక్టర్ అబ్దుల్ వదూద్,రికవరీ అధికారి బుర్హానుద్దీన్ మజీద్,బీఎంసీ సభ్యులు,మేనేజర్లు,సిబ్బంది,సుబేదారి శాఖ వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ఖాలిద్ సయీద్ మాట్లాడుతూ ప్రచారం లక్ష్యాలు,ఉద్దేశాలను వివరించారు.సేవా మ్యాక్స్ పరిధిలోని అన్ని శాఖల పనితీరును,ముఖ్యంగా సుబేదారి శాఖ సేవలను అబ్దుల్ వదూద్ ప్రశంసించారు.మిన్హాజ్ పాఠశాల కరస్పాండెంట్ ముఫ్తీ మిన్హాజ్ మాట్లాడుతూ సేవా క్రెడిట్ సొసైటీ అందిస్తున్న సేవలను అభినందించి,సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతరం బుర్హానుద్దీన్ మజీద్ మాట్లాడుతూ వడ్డీ రహిత సూక్ష్మ రుణాల ప్రచారం ప్రాముఖ్యత,లక్ష్యాలు,సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.సంస్థ విజన్‌–2030లో భాగంగా మరో 100 శాఖలను ఏర్పాటు చేయడం,సభ్యుల సంఖ్యను ఐదు లక్షలకు పెంచడం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర భారతదేశంలోనూ సేవలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
🏠 Home