వరంగల్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వరంగల్, ఆగస్టు 15, 2026: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. మహనీయులు కలలుగన్న సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు వరంగల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి పనిచేయాలని సూచించారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహూద్ పాష, శ్రీపాద సతీష్, రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.