కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 15 ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం
హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు 15 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ విశ్వవిద్యాలయ పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు.
ఈ అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు చిర్ర రాజు గౌడ్, సుధాకర్, సుదర్శన్, అనిత రెడ్డి, రమా రెడ్డి, సురేష్ లాల్, భాలు చౌహాన్, నవీన్, సుకుమార్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్రం తదితరులు సెక్రటేరియట్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ప్రతిపాదనను వివరించారు.
విశ్వవిద్యాలయ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, సహకారం అందేలా కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.