11వ డివిజన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కతల్గూడలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు 18-08-2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ గారు, అబ్బగోని రమేష్ గౌడ్ గారు అతిథులుగా హాజరయ్యారు .ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ధైర్యసాహసాలు, ప్రజా సేవ, సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని నాయకులు, ప్రజలు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఘన నివాళులు అర్పించారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు